విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ హీరో!
గత కొంత కాలంగా పలువురు సెలబ్రెటీలు విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తున్నారు. సమంత- నాగచైతన్య మొదలు హార్దిక్ పాండ్య- నటాషా వరకు చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరారు. ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు జయం రవి – ఆర్తి . తాజాగా ఆయన తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు అధికారకంగా ప్రకటించారు.
అందులో ఆయన “చాలా ఆలోచించిన తరువాత నా భార్యతో విడిపోవాలని చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయాన్ని నాపై ఆధారపడిన వారిని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నాను. ఇలాంటి సమయంలో నా ప్రైవసీని గౌరవించాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నాను. ఈ విషయాన్ని నా వ్యక్తిగత విషయంగానే ఉంచాలని ప్రార్థిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసారు.
జయం రవి- ఆర్తి 2009 లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.
జయం రవి తండ్రి మోహన్. ఇతను తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు ఎడిటర్‌గా పని చేసారు. అన్న కూడా ఫేమస్ డైరెక్టర్ మోహన్ రాజా.