Home Page SliderTelangana

తెలంగాణలో మరో ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉండి, ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి స్థానంలో ఈ ఎన్నిక జరగనుంది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 29న పోలింగ్ జరుగుతుంది. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన షబ్బీర్ అలీ, జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం లభించే అవకాశం ఉంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల బరిలో సైతం ఈ ఇద్దరు నేతలు నిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయ్. నిజామాబాద్ ఎంపీగా షబ్బీర్ అలీ, మెదక్ ఎంపీగా జగ్గారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు.