Home Page SliderInternational

అమెజాన్‌లో మరో 9 వేల ఉద్యోగాల కోత

ఈ ఏడాది సంస్థలో పనిచేస్తున్న పది వేల ఉద్యోగులను తగ్గించుకోనే ఆలోచనలో ఉన్నట్టు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్ కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటికే అమెజాన్ 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. AWS, అడ్వర్టైజింగ్, ట్విచ్‌లో వచ్చే కొన్ని వారాల్లో మరో 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు Amazon.com Inc సోమవారం వెల్లడించింది. కరోనా తర్వాత పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించామని.. ఐతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఉద్యోగులను తగ్గించుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం తప్ప గత్యంతరం లేకుండా పోయిందని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు. క్లౌడ్ సేవలు, ప్రకటనలు, ట్విచ్ యూనిట్లలో సిబ్బందిని తగ్గిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత త్రైమాసికంలో ఆపరేటింగ్ లాభం క్షీణించవచ్చని అమెజాన్ గత నెలలో పేర్కొంది. వినియోగదారులు, క్లౌడ్ కస్టమర్లు, ఆర్థిక ఇబ్బందులతో తగ్గారని పేర్కొంది. నాల్గో త్రైమాసికంలో లాభదాయకమైన క్లౌడ్-కంప్యూటింగ్ విభాగం నుండి అమ్మకాలు పూర్తిగా తగ్గాయంది. దీంతో వర్చువల్ ప్రైమరీ కేర్ ఆఫర్ వంటి మొత్తం సేవలను సంస్థ ఎత్తేస్తున్నట్టు తెలుస్తోంది.