ఏపీలో జూనియర్ డాక్టర్ల “సమ్మె”ట పోటు
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల నుండి సమ్మెదెబ్బ తగిలింది. అరకొర జీతాలతో పనిచేయలేమని వారు తెగేసి చెప్పారు. వారి స్టైఫండ్ 42 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 25 వరకూ సమయం ఇస్తామని, ఆ లోపు తమ సమస్యలను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఈ నెల 25 వరకు పని చేయనున్నారు. 26 వ తేదీన ఓపీ సేవలు బహిష్కరించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 27 నుండి అత్యవసర సేవలను కూడా కొనసాగించలేమని వారు పేర్కొన్నారు. వైద్యం అత్యవసర సేవ అని, తమ కష్టాన్ని గుర్తించమని, తమకు పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నారు.