ఇక నిర్ణయం పిఠాపురం ప్రజలదే.. మీ వర్మ భవితవ్యం మీ చేతుల్లోనే
వచ్చే ఎన్నికల్లో పోటీపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కన్పిస్తోంది. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగనుండటంతో ఆయన తన పంథా మార్చారు. వచ్చే ఎన్నికల్లో తన భవిష్యత్ నిర్ణయించాల్సింది పిఠాపురం ప్రజలేనని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లో రాసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో.. వర్మ అభిమానులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఉన్న సామాగ్రిని కాల్చివేయడంతోపాటు, పవన్ కల్యాణ్ పై నిప్పులు కురిపించారు. పవన్ కల్యాణ్ కాకినాడలో పోటీ చేయొచ్చని.. ఎందుకు పిఠాపురంలో పోటీ చేస్తారని మండిపడ్డారు.

