Home Page SliderInternationalNews

నాలుగేళ్లలో 165 కేజీల బరువు తగ్గిన అమెరికన్… ఏం చేశాడో తెలిస్తే మీరూ పాటిస్తారు..!?

అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఓ వ్యక్తి, “టిక్కింగ్ టైమ్ బాంబ్” ఏ క్షణానైనా టైమ్ బాంబ్‌లా పేలి చనిపోతాడని, అధిక బరువుతో ఎక్కువ కాలం జీవించడని డాక్టర్ హెచ్చరించడంతో… నాలుగేళ్లలో తాను 365 పౌండ్లు… దాదాపు 165 కిలోలు బరువు తగ్గాడు. దాదాపు 300 కిలోల బరువు కలిగి ఉన్న ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనే ఆశ, ప్రేరణతో తీవ్రమైన బరువును తగ్గాడు. నికోలస్ క్రాఫ్ట్ బరువు తగ్గించే ప్రయాణాన్ని 2019లో ప్రారంభించాడు. డైటింగ్ ద్వారా మొదటి నెలలో సుమారు 18 కిలోల బరువు తగ్గాడు. ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో మాట్లాడుతూ, 42 ఏళ్ల క్రాఫ్ట్ చిన్నతనం నుండి తన బరువుతో పోరాడుతున్నానని చెప్పాడు. హైస్కూల్‌ చదివే రోజుల్లోనే 136 కిలోలు బరువుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనన్నాడు.

డిప్రెషన్ కారణంగా తాను అతిగా తినేవాడన్నాడు. అందుకే బరువు రోజు రోజుకు పెరుగుతూ పోయానంటాడు. బరువు పెరగడం వల్ల… తన పనులను సైతం తాను చేసుకోలేకపోయనంటాడు. శరీర నొప్పులు, మోకాళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడంతో దినదిన గండం నూరేళ్లు ఆయుష్యులా తన పరిస్థితి మారిదంటాడు. బయటకు ఎక్కడికైనా వెళ్తే అందరూ చూసి నవ్వేవారన్నాడు. కనీసం వెహికల్ ఎక్కాలన్నా.. తనకు సూటయ్యే బండ్లు ఒక్కటి కూడా ఉండేవి కాదన్నాడు. బరువు కారణంగా సమీప బంధువుల ఇళ్లలో జరిగే వేడుకల్లోనూ పాల్గొనలేకపోయానన్నాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లడం కూడా ఆపివేశానన్నాడు. 2019లో, ఒక వైద్యుడు క్రాఫ్ట్‌ పరిస్థితిని బట్టి.. బరువు తగ్గడం ప్రారంభించకుంటే… టైమ్ బాంబ్‌లా ఏ క్షణానైనా పేలిపోతావంటూ హెచ్చరించాడు. బరువు సమస్యను అధిగమించకుంటే… మూడు, నాలుగేళ్ల కంటే ఎక్కువ బతకవని డాక్టర్ తనకు వార్నింగ్ ఇచ్చాడంటాడు క్రాఫ్ట్. మరో ఐదేళ్ల కంటే ఎక్కువ బతకడం కష్టమని డాక్టర్ తేల్చేశాడంటాడు.

అప్పటి వరకు ఎవరేం చెప్పినా తాను పెద్దగా పట్టించుకోలేదని… మృత్యువు తప్పదని తెలిసిన తర్వాత.. జీవితంపై తనకు ఆశ పెరిగిందంటాడు. ఎక్కువ కాలం జీవించాలన్న తన లక్ష్యం మేరకు శరీరాన్ని కరిగించాలని, బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానంటాడు. బరువు తగ్గడానికి ముఖ్యంగా కావాల్సిన ఆహారపు అలవాట్లను మార్చుకున్నాని చెప్పాడు. ఐతే బరువు తగ్గడానికి క్రాఫ్ట్ ప్రత్యేక ఆహారాన్ని ఏమీ తీసుకోలేదన్నాడు. రోజూ ఎక్సర్‌సైజులు, తీసుకునే ఆహారంలో ఉన్న క్యాలరీలపై ఎక్కువ ఫోకస్ పెట్టానన్నాడు. జంక్ ఫుడ్‌ వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని.. బరువు తగ్గే క్రమంలో ఇన్ స్టాంట్ ఫుడ్ మానేశానన్నాడు.

బరువు తగ్గడం ప్రారంభించినప్పుడు రోజుకు 1,200 నుండి 1,500 కేలరీలు మాత్రమే తీసుకున్నానన్నాడు. తాను బరువు తగ్గడానికి అమ్మమ్మ ప్రోత్సహమే కారణమంటాడు. జీవితంలో ఎవరిని మరచినా ఆమెను మాత్రం మరువలేనంటాడు. తరచుగా తనను ఆమె చూడాలని కోరుకునేదని… ఆమె కోసం తొందరగా బరువు తగ్గాలనుకున్నానన్నాడు. అదే సమంయలో బరువు భారీగా తగ్గుతానని ఆమెకు మాట ఇచ్చానన్నాడు. క్రాఫ్ట్ బరువు తన ఉబయకాన్ని తగ్గించుకునే సమయంలో అమ్మమ్మ మరణించిందని… ఇదే తన జీవితంలో అత్యంత విషాధ ఘటనంటాడు క్రాఫ్ట్. బరువు తగ్గిన తర్వాత తన శ్వాస మెరుగుపడిందని, ప్రయాణాల్లో ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు.