NewsTelangana

రామోజీరావును కలవనున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 21న రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలవనున్నారు. ఈనెల 21న మునుగోడు వస్తున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సాయంత్రం 6.45 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకుంటారు. రాత్రి ఏడున్నర గంటల వరకు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశమవుతారు. ఈనాడు సంస్థల అధినేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు గుర్తింపు పొందారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రామోజీ ఫిల్మ్ సిటీకి రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామోజీరావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్కక్రమాల్లో ఈనాడు చురుకుగా పాల్గొంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ లో ఈనాడు సంస్థలు కీలక పాత్ర పోషించాయ్. 2016లో దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో మోదీ సర్కారు రామోజీరావును సత్కరించింది.