NewsTelangana

తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్ల పెట్టుబడులు

ప్రముఖ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్లలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ పదేళ్లలో తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన మరియు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కోసం పరిశోధన మరియు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు అమర రాజా బ్యాటరీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వచ్చే పదేళ్లలో అవసరమైన అనుమతుల తర్వాత, కంపెనీ రూ. 9500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని కంపెనీ అభిప్రాయపడింది.

హైదరాబాద్‌లో అమర రాజా ఈ-హబ్‌గా పిలువబడే శక్తి పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ఉంటుంది. మెటీరియల్ రీసెర్చ్, ప్రోటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, కాన్సెప్ట్ డెమోన్‌స్ట్రేషన్ యొక్క రుజువు కోసం అధునాతన లేబొరేటరీలు, టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇందులో అమర్చబడి ఉంటాయంది. అభివృద్ధి అవసరాలను తీర్చడంతోపాటు శక్తి, పర్యావరణ వ్యవస్థలో పెను మార్పులు తీసుకురానుంది. అమర రాజా బ్యాటరీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు, మొత్తం ప్రాంతానికి స్థిరమైన సాంకేతికతలలో ఆవిష్కరణలకు ఊతమిస్తుందన్నారు. రాష్ట్రంతో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నామని… ఎట్టకేలకు ఇక్కడ పారిశ్రామిక స్థావరాన్ని స్థాపించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నామన్నారు.

అధునాతన సెల్ టెక్నాలజీ ఉత్పత్తుల గిగా స్కేల్ తయారీ వైపు తన ప్రయాణంలో భాగంగా, కమర్షియల్ స్కేల్ పైలట్ ప్లాంట్… మొదటి గిగా స్కేల్ సెల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నామంది. భారత ఉపఖండంలోని పరిస్థితులకు ప్రత్యేకంగా సరిపోయే లి-అయాన్ సెల్ కెమిస్ట్రీలపై పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని టూవీలర్, త్రీ-వీలర్ OEMలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లు, ఛార్జర్‌లను సరఫరా చేస్తున్నామని అమర రాజా చెప్పారు. అమరరాజా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అన్నారు మంత్రి కేటీఆర్. 37 ఏళ్లుగా సేవలందిస్తున్న సంస్థ, 9500 కోట్ల రూపాయలు పెట్టబడులు గొప్ప విషయమన్నారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు కేటీఆర్.