Home Page SliderTelangana

యూట్యూబ్ ఛానెల్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి

హైదరాబాద్‌లోని ‘రెడ్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానెల్ కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ ఛానెల్ వారు గత కొంత కాలంగా అల్లు అర్జున్, ఆయన భార్యాపిల్లలపై అవమానకరమైన పోస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కనీస మర్యాద, పద్దతి లేకుండా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారని, అందుకే ఇలా ముట్టడించి, వారిని హెచ్చరించామని పేర్కొంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. ఆ యూట్యూబ్ యజమానితో మాట్లాడి ఆ పోస్టులను డిలీట్ చేయాలని హెచ్చరించామని పేర్కొన్నారు.