శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బేగంపేటలోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై డాక్టర్లను ఆరా తీశారు. పూర్తిగా రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుందనేటువంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు.