పొత్తులు ప్రజల మేలు కోసమే: జనసేనాని పవన్ కల్యాణ్
టీడీపీ లేదా బీజేపీ లేదా కమ్యూనిస్టులతో పొత్తు పూర్తిగా రాజకీయ కారణాలతో నడపబడదనే సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని ఆయన పార్టీ అధికార ప్రతినిధులకు సూచించారు. “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎవరికి తెలుసు, ఒక పార్టీ తన బద్ధ శత్రువులతో కలిసి పనిచేయాల్సిన ఒత్తిడి రావొచ్చు. ”అని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కాసులతో ఓట్లను కొనే దుస్థితికి తాను ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రాత్రికి రాత్రే ముగిసిపోయేది కాదని పవన్ విమర్శించారు. ఎన్నికల వేళ ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, టెలివిజన్ చర్చల్లో పార్టీ తరపున మాట్లాడే ముందు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా సమస్యలపై సవివరంగా అధ్యయనం చేయాలని సూచించారు. వక్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రబలుతున్న ఊహాగానాలకు లొంగకూడద మతం వంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యానించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే ఇతరులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ఆయన హితవు పలికారు.