Home Page SliderInternational

AI అంటే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే’ కాదు… ‘అమెరికా, ఇండియా’ కూడా

AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత శక్తివంతమయ్యిందో అమెరికా ఇండియా కూడా అంత శక్తివంతమైన దేశాలని భారత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండూ కలిస్తే తిరుగులేని శక్తిగా ఎదుగుతాయని, కలిసి పనిచేస్తే ప్రపంచాన్నే మార్చగలవని వ్యాఖ్యానించారు.

మోదీ అమెరికా పర్యటన పూర్తయ్యింది. చివరిగా ప్రవాస భారతీయులతో గడిపిన ఆయన  వారితో మాట్లాడుతూ, భారత్ అమెరికాలు కలిసి విధానాలు, ఒప్పందాలు రూపొందించడంతో పాటు జీవితాలు, కలలను ,భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతున్నాయని ప్రశంసించారు. ప్రధాని వీడ్కోలు సందర్భంగా ప్రఖ్యాత అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయగీతమైన జనగణమన పాడారు. పాట పూర్తయ్యాక ప్రధాని మోదీ పాదాలు తాకి నమస్కరించడం విశేషం. ప్రధానికోసం భారత జాతీయగీతాన్ని పాడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. భారత్, అమెరికా గీతాలు రెండూ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఆదర్శమని సంతోషం వ్యక్తం చేసిందామె. అమెరికాకు వీడ్కోలు పలికిన అనంతరం మోదీ ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు.