హైదరాబాద్ ORR వద్ద త్వరలో ఏఐ సిటీ
విశ్వనగరం హైదరాబాద్‌కు మరో మణిహారం రాబోతోంది. ఓఆర్‌ఆర్ వద్ద త్వరలోనే ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాల స్థలాన్ని సమీకరించి, త్వరలో శంకుస్థాపన చేయబోతోంది. శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం వంటి ప్రాంతాలలో దీనికోసం భూములను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చేనెలలో జరగబోయే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు ముందుగానే దీనికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో టెక్నాలజీ పార్కులు శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, అందుకే కొత్త ఏఐ టెక్నాలజీతో నూతన నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.