రాజాసింగ్ పీడీ యాక్ట్‌ను సమర్థించిన అడ్వైజరీ బోర్డు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలంటూ రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ జరిగింది. హైదరాబాద్ పోలీసుల వాదనతో అడ్వైజరీ కమిటీ ఏకీభవించింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, ఇందులో 18 కేసులు కమ్యూనల్‌కు సంబంధించినవి కావడంతో పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు.. పీడీ యాక్ట్‌ను కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బోర్డు తేల్చి చెప్పింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది. దీంతో రాజాసింగ్ తరఫు లాయర్ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది.