నాగార్జున పిటిషన్ వాయిదా
సినీ నటుడు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ కోర్టులో ఇవాళ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. అయితే జడ్జి సెలవులో ఉన్నకారణంగా విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

