అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు ప్రభు
తమిళ ప్రముఖ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శివాజీగణేషన్ కుమారుడైన ప్రభు పలు తమిళ సినిమాలలో నటించారు. మన తెలుగువారికి కూడా డబ్బింగ్ చిత్రాల ద్వారా సుపరిచితమే. ఆయనకు సోమవారం రాత్రి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీనితో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యనే ఆయనకు కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్స చేయించారని సమాచారం. కిడ్నీలో స్టోన్స్ లేజర్ చికిత్సతో తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ప్రమాదం లేదని , త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలియజేశారు. ఆయన అభిమానులు త్వరలో కోలుకోవాలంటూ సోషల్‌మీడియాలో కోరుకుంటున్నారు. ఘర్షణ, చంద్రముఖి, వారసుడు, డార్లింగ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.