డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్..
మలయాళ నటుడు, తెలుగులో దసరా మూవీ విలన్ షైన్ టామ్ చాకోను డ్రగ్స్ వాడుతున్న నేరానికి కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఒక హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. అయితే పోలీసులు రావడానికి కాసేపటి ముందే చాకో అక్కడ నుండి పారిపోయాడని వార్తలు వచ్చాయి. అతడు కిటికీలో నుండి దూకి పారిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీనితో విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. 4 గంటల పాటు అతడిని ప్రశ్నించి, ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.