Andhra PradeshHome Page Slider

చంద్రబాబు కేసులో మధ్యహ్నం తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇవాళ మధ్యహ్నం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్,బెయిల్ ఇవ్వాలని బాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.అయితే చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.