Andhra PradeshHome Page Slider

ఏపీ అంతటా సర్వే నిర్వహిస్తున్న ఆరా సంస్థ

ఏపీ, తెలంగాణలో విస్తృతంగా ఆరా సంస్థ సర్వే చేపట్టింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో సహా, ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోడానికి ఆరా సర్వే సంస్థ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే తెలంగాణ సర్వేను పూర్తి చేసేందుకు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ మొత్తం సర్వే చేసిన ఆరా సంస్థ, మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయ్? రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నదానిపై సమగ్రమైన విశ్లేషణలను అందించనుంది. అదే సమయంలో ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది? ఎవరు ప్రతిపక్షానికి పరిమితమవుతారన్నదానిపైనా ఆరా ఏజెన్సీ సర్వే నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం అంతగా ఉండటం లేదు. అందుకే ఆరా సర్వే సంస్థ.. ఏపీ, తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో సర్వే చేస్తోంది. ఇక లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సైతం ఆరా యంత్రాంగం సర్వేలు చేసుకునేందుకు తగిన ప్రాతిపదికను రెడీ చేస్తోంది.