NationalNews

భారత్‌ జోడో యాత్రలో ఆదిత్య థాక్రే అడుగులు…

రాహుల్‌ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ చేపట్టిన `భారత్‌ జోడో యాత్ర` మహారాష్ట్రలోకి అడుగుపెడుతోంది. ఈ యాత్రలో శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే పాల్గొననున్నారు. థాక్రే గ్రూప్‌ ఎమ్మెల్యే సచిన్‌ అహిర్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. యాత్రలో పాల్గొనేందుకు ఆదిత్య ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతున్నాయి. భారత్‌ జోడో యాత్రలో శివసేన పాల్గొంటుందని ఉద్ధవ్‌ థాక్రే సైతం ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే తాను హాజరయ్యే అవకాశాలు మాత్రం తక్కువేనని చెప్పారు.