News

కళ్ల ముందే మూడు కోట్ల లాంబర్గినీ కారును ధ్వంసం చేసిన యూట్యూబర్

ఒక విచిత్రమైన మార్కెటింగ్ స్టంట్‌లో, మిఖాయిల్ లిట్విన్… ప్రసిద్ధి చెందిన రష్యన్ యూట్యూబర్, తెల్లటి లాంబర్గిని ఉరస్ SUVని పూర్తిగా ధ్వంసం చేయించాడు. మొత్తం ఈవెంట్‌ను టేప్‌లో బంధించాడు. భారతదేశంలో ₹ 3.15 కోట్ల ప్రారంభ ధర కలిగిన అల్ట్రా-లగ్జరీ కారును, లిట్విన్ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్, లిట్ ఎనర్జీ ప్రమోషన్ కోసం ముక్కలు చేశాడు. ఆ వీడియోను లిట్విన్ యూట్యూబ్‌లో షేర్ చేశాడు. లిట్విన్‌కు యూట్యూబ్‌లో 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీడియోలో సెటప్‌ను ఒక భారీ క్రేన్‌తో సస్పెండ్ చేసిన క్యాన్‌‌ను లాంబర్గిని SUV పైభాగంలో పడేశారు. సెకన్లలో కారు పూర్తిగా నాశనమయ్యింది. లిట్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇదే వీడియోను షేర్ చేశాడు. “URUS చాలా బాగుంది,” అని అంటూ రాసుకొచ్చాడు.

ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం అప్‌లోడ్ చేయగా… యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. 7 లక్షల కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియోపై పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యారు. కొందరు ఈ చర్యను సమర్ధిస్తే, కొందరు విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న దానితో ప్రజలు సంతోషంగా జీవించడం విచారకరం. లాంబర్గిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SUVలలో ఒకటి. ఈ మోడల్‌ను 2018లో తీసుకొచ్చారు. 4-డోర్ల లగ్జరీ SUV. ఈ లగ్జరీ కారు 4.0 లీటర్ V8, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.