Home Page SliderNational

చందమామతో ఐదు గ్రహాలు -ఆకాశంలో నేడు అద్భుత దృశ్యం

 ఈరోజు సాయంత్ర సంధ్యవేళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కుతం కానుంది. సూర్యాస్తమయం అనంతరం చంద్ర దర్శనంతో పాటు ఐదు గ్రహాలు కూడా అదే వరుసలో కనువిందు చేయనున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే వరసలో దర్శనం ఇవ్వబోతున్నాయి. మనం శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి గ్రహాలను మామూలు కంటితో వీక్షించవచ్చు. కానీ బుధుడు, యురేనస్ గ్రహాలను పవర్ ఫుల్ బైనాక్యులర్స్ లేదా, టెలిస్కోప్‌ల సహాయంతో మాత్రమే చూడగలం.

సూర్యాస్తమయం అనంతరం చంద్రవంక పక్కనే కాంతివంతమైన బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చు. దానిపక్కనే బుధ గ్రహం చాలా కాంతి హీనంగా కనిపిస్తుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఒక వరుసలో ఏర్పడడంతో ఇటువంటి అరుదైన దృశ్యం చూసే అవకాశం లభిస్తుంది. ఇటువంటి అమరిక మళ్లీ 2040 వరకూ చూడలేమంటున్నారు శాస్త్రవేత్తలు.