Breaking NewsHome Page SliderNews

సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణ‌మే ..కానీ!

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని పేర్కొంది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్య గ్రహణం కావడం విశేషం.