Andhra PradeshHome Page Slider

పాఠాలు చెప్తూనే గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

బాపట్ల జిల్లా చీరాలలో విషాదం చోటుచేసుకొంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయాడు. చీరాల మండలంలోని వాకావారిపాలెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇంకొల్లు గ్రామానికి చెందిన వీరిబాబు (45) ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే 108 సమాచారం అందించారు. వైద్య సేవలు చేసిన 108 సిబ్బంది ఆప్పటికే.. ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు కళ్లముందే మృతి చెందడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.