Home Page SliderNational

తండ్రి ఇంటిని వీడనున్న స్టార్ హీరో దంపతులు

ప్రముఖ స్టార్ హీరో సూర్య  దంపతులు ఎంతోకాలంగా తన తల్లిదండ్రులు,తమ్ముడు కార్తీతో కలిసి నివశిస్తున్నారు. అయితే ఈ విధంగా ఉమ్మడి కుటుంబంతో జీవించడం తనకెంతో ఇష్టమని ఆయన పలు సందర్భాలలో తెలిపారు. కాగా ఇటీవల కాలంలో సూర్య తండ్రి శివకుమార్‌తో ఆయనకు మనస్పర్థలు తలెత్తినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీంతో ఆయన త్వరలోనే ఉమ్మడి కుటుంబాన్ని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య తన కుటుంబ సమేతంగా ముంబయికి మకాం మార్చాలనుకుంటున్నారని సమాచారం. దీనికి తోడు ఆయన ఇటీవల ముంబైలో రూ.70 కోట్లతో  ఓ లగ్జరీ ఇళ్లు కూడా కొనడంతో ఈ వార్తలకు కొండంత బలం చేకూరింది. అయితే త్వరలోనే సూర్య దంపతులు ముంబైలోని ఇంటికి వెళ్లేందుకు గృహప్రవేశం కూడా చేయబోతున్నారని సమాచారం.