Home Page SliderNational

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక అవార్డు

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి భారతీయ సినిమాకు చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ అవార్డును అక్టోబర్ 8న జరగబోయే 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫంక్షన్‌లో అతడికి అందజేస్తారు. మిథున్ చక్రవర్తి పవన్ కళ్యాణ్, వెంకటేశ్ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో ప్రతినాయకుని పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈ ఏడాదే ఆయనకు ‘పద్మభూషణ్’ బిరుదు కూడా లభించడం విశేషం. మిథున్ చక్రవర్తి కల్‌కతాలో జన్మించారు. 1976 చిత్రం మృగయాలో తొలిసారిగా నటించారు. ఈ నటన ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించిపెట్టింది. కొన్ని సంవత్సరాలుగా, మిథున్ తహదర్ కథ (1992), స్వామి వివేకానంద (1998)లో తన పాత్రలకు మరో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. ఇటీవల, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్‌లో నటించారు. ఆయన కుమారుడు, నమషి చక్రవర్తి, బ్యాడ్ బాయ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.