ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రతన్ టాటా జ్ఞాపకం
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టాటా కంపెనీ అధినేత దివంగత రతన్ టాటా జ్ఞాపకార్థం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆయన గౌరవార్థం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఒక కొత్త భవనాన్ని నిర్మించబోతోంది. దీనిని టాటా గ్రూప్, సోమర్ విల్లే కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిపి ఉమ్మడిగా నిర్మించనున్నాయి. బోధన, విద్యా కార్య కలాపాల నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ నిర్ణయంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భారతీయుల మనసు గెలుచుకుంది.