Home Page SlidermoviesPoliticstelangana,

దిల్ రాజుకు కీలక పదవి

సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టిఎప్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయనను ఎంపిక చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవీకాలం రెండేళ్లు కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ప్రత్యక్షంగా ఎన్నికలలో పాల్గొంటారని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పేరిట ఆయన సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రనిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన తొలిసారి నిర్మాతగా తీసిన దిల్ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు స్థిరపడిపోయింది.