Andhra PradeshHome Page Slider

స్కిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం

అప్రూవర్ గా మారిన 13వ నిందితుడు చంద్రకాంత్
ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన సిఐడి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితునుగా ఉన్న స్కిల్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదే కేసులో 13వ నిందితుడైన చంద్రకాంత్ అప్రూవర్ గా మారాడు. దీంతో చంద్రకాంత్ ను సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సిఐడి అభియోగం మేరకు ఏసీఐ కంపెనీ ఎండి చంద్రకాంత్ షా స్కిల్స్ స్కాం కేసులో కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో నిధుల స్వాహాకు సంబంధించి గత ఏడాది జులై 23న గుంటూరు కోర్టులో 164 సిఆర్ పిసి కింద చంద్రకాంత్ వాంగ్మూలం ఇచ్చినట్లు సిఐడి చెబుతోంది. ఈ క్రమంలో కీలక నిందితుడైన చంద్రకాంతను కోర్టు ఎదుట హాజరపరిచిన సిఐడి అధికారులు ఆయన అప్రూవర్ గా మారారని అందుకు అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాను అప్రూవూర్ గా మారి స్కిల్ స్కామ్ లో కుట్రను అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చానని పేర్కొన్నారు. చంద్రకాంత్ ను అప్రూవర్ గా మారేందుకు అనుమతించి ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని పిటిషన్ల్ లో కోరారు. ఈ మేరకు తాను అప్రూవర్ గా మారుతున్నట్లు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.