కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే BPL కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఉచితంగా 10 కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఈ హామీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. కానీ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం బియ్యం నిల్వలు అందుబాటులో లేవు. దీంతో కర్ణాటక ప్రభుత్వం దీనికి ప్రత్యమ్నాయ మార్గాన్ని ఆలోచించింది. అదేంటంటే పేదప్రజలకు బియ్యానికి బదులు నగదు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాగా బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేసేంత వరకు ఒక్కో కేజీకి రూ.34 రూపాయలు ఇస్తామని ప్రకటించింది.