ముడి పెట్రోలియంపై భారీగా తగ్గిన విండ్‌ఫాల్ పన్ను
దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును టన్నుకు ₹5,200 నుండి ₹3,250కి తగ్గించింది. ఇది శనివారం నుండి అమలులోకి వస్తుంది. పన్ను ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED) రూపంలో విధించబడుతుంది. డీజిల్, పెట్రోల్, జెట్ ఇంధనం లేదా ATF ఎగుమతిపై SAED పన్ను ఇకపై సున్నాగా నిర్ణయించారు. త్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయని అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. భారతదేశం మొదటిసారిగా జూలై 1, 2022న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించింది. ఇంధన కంపెనీల సూపర్‌నార్మల్ లాభాలపై పన్ను విధించే అనేక దేశాలలో చేరింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా పన్ను రేట్లను సమీక్షించారు.


