Home Page SliderNational

9 నెలలకే కుప్పకూలిన భారీ శివాజీ విగ్రహం

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలింది. మల్వాన్ లోని రాజ్ కోట వద్ద సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయింది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియలేదు. అయితే జిల్లాలో గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023, డిసెంబర్ 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.