Andhra PradeshHome Page SliderPolitics

సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌కు భారీ షాక్

వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేశారు పోలీసులు. పులివెందులలో అట్రాసిటీ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ రెడ్డికి, మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి కూడా ఈ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. భార్గవ్ రెడ్డి గుంటూరులో నమోదైన మరో కేసు విషయంలో ముందస్తు బెయిలుకు పిటిషన్ వేయగా అది ఈ నెల 14కు వాయిదా పడింది.