NationalNews

గుజరాత్ ఎన్నికల వేళ కేంద్రానికి భారీ ఉపశమనం

దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి ఇది అతి భారీ విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సిస్టమ్‌ను EWS కోటా ఉల్లంఘించబోదని కోర్టు స్పష్టం చేసింది. EWS కోటా వివక్షాపూరితమైనది కాదని.. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చదని, సుప్రీం కోర్ట్ బెంచ్ మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. రేపు పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్‌తో సహా ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ రవీంద్ర భట్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారి కోటాకు తాను మద్దతు ఇస్తున్నానని, అయితే సామాజికంగా వెనుకబడిన వర్గాలను మినహాయించడం రాజ్యాంగం అనుమతించబోదన్నారు. పేదరికం, వెనుకబాటుతనం ఈ సవరణకు వెన్నెముక అని… రాజ్యాంగపరంగా సవరణ సమర్థించలేమన్నారు. షెడ్యూల్డ్ కులాలు / షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (OBC) వంటి తరగతులను మినహాయించడం రాజ్యాంగం అనుమతించదని జస్టిస్ భట్ అన్నారు. జస్టిస్ భట్ అభిప్రాయంతో ఏకీభవించానన్న చీఫ్ జస్టిస్ లలిత్… నిర్ణయం 3:2గా ఉందన్నారు.