Home Page SliderTelangana

ఇండ్లలోకి భారీ మొసలి.. భయాందోళనలో కుటుంబ సభ్యులు

వనపర్తి జిల్లాలో భారీ మొసలి కలకలం సృష్టించింది. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కవిత తమ ఇంటి ఆవరణలో ఇవాళ ఉదయం చెట్లపొదల్లో భారీ మొసలిని చూసి భయాందోళనకు గురైంది. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే వనపర్తి లోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న టీం సభ్యులు ఇంటి దగ్గర 11 ఫీట్ల పొడవు.. 230 కేజీల బరువు గల భారీ మొసలిని గుర్తించి తాళ్లతో కట్టి పట్టుకున్నారు. దాదాపు 3 గంటల పాటు మొసలిని పట్టుకునేందుకు శ్రమించారు. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్లు తగ్గడం వల్ల కాలువలకు సమీపంలో ఉన్న పంట పొలాలోకి, ఇండ్లలోకి మొసళ్లు వస్తున్నాయన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.