ఎమ్మెల్యే పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన పేరుతో ఎవరో, కొందరికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన పేరుతో కార్పొరేటర్లకు, కొందరు రాజకీయ నేతలకు, తన పేరుతో తనకే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై కంప్లైట్లు చేస్తామన్నారు. ఓడిపోయిన కోపంతో మైనంపల్లి వర్గీయులే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి స్కూఫ్‌లు చేయడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.