మద్యం మత్తులో యువకుడు హల్ చల్.. బైకులను ఢీకొట్టిన కారు..
గుజరాత్ లోని వడోదరాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యువకుడు బైకులను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఓ మహిళతో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలవడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు నడిపిన ఆ యువకుడిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.