జనగామ కలెక్టరేట్ వద్ద భూసమస్య పరిష్కారం కోసం దంపతుల ఆత్మహత్యాయత్నం
భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కలెక్టర్ కార్యాలయంపైకి ఎక్కి డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. గమనించిన సిబ్బంది.. హుటాహుటిన దంపతులను కిందకు దించి వారిపై నీళ్లు పోశారు. దంపతులను పసర్లమడకు చెందిన నర్సింగరావు, రేవతిగా గుర్తించారు. గతంలో నర్సింగరావు రెండు సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎన్నాళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా.. తమ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


