క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
మేడ్చల్ జిల్లా మల్లికార్జుననగర్‌లో క్యాబ్ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఒక హాస్టల్‌లో క్యాబ్ డ్రైవర్ మహేందర్ రెడ్డి(38)ని, అదే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే వ్యక్తి కత్తితో పొడిచి, వంట గరిటలతో కొట్టి చంపాడు. గతంలో మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి అదే హాస్టల్‌లో ఉండేవారు. ఇటీవల ఖాళీ చేసినా కూడా పలుమార్లు మహేందర్ రెడ్డి కిరణ్ రెడ్డి వద్దకు వచ్చి గొడవ పడేవాడని సమాచారం. నేడు తెల్లవారుజామున మరోసారి హాస్టల్ వద్దకు వచ్చి మహేందర్ రెడ్డి గొడవకు దిగాడని, దీనితో హాస్టల్ నిర్వాహకులు, కిరణ్ రెడ్డి కలిసి మహేందర్ రెడ్డిపై దాడి చేశారని సాక్ష్యులు పేర్కొన్నారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వీరి గొడవకి వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు పేర్కొన్నారు.