ప్రమాదంలో బాలుడి మృతి.. కుటుంబానికి 2,624 కోట్లు
అమెరికాలోని ఓర్లాండ్ లోని ఓ పార్క్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ లోని ఫ్రీ పాల్ టవర్ నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు. టైర్ సాంప్సన్ (14) అనే బాలుడు 2022లో తన ఫుట్ బాల్ టీం తో కలిసి ఐకాన్ పార్క్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. ఒక రైడ్ లో 129 కిలో గ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు. అయితే, సాంప్సన్ బరువు 173 కిలో గ్రాములు. బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలుడిని రైడ్ కు వెళ్లేందుకు అనుమతించారు. అయితే రైడ్ సమయంలో సాంప్సన్ పెట్టుకున్న సీటు బెల్టు ఊడిపోవడంతో అతడు 70 అడుగుల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే బాధితులు ఫ్లోరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైడ్ కు సంబంధించిన నిర్వహకులు.. ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే దృష్టి పెట్టారు. అందువల్లే ఆ బాలుడు మృతి చెందాడని బాధితుల తరపు న్యాయవాదులు వాదించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. మృతుడి కుటుంబ సభ్యులకు 310 మిలియన్ డాలర్లు (2,624 కోట్లు) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కార్పొరేషన్లు భద్రత విషయంలో జవాబుదారీ తనం తీసుకు రావాలనే ఈ తీర్పునిస్తున్నట్లు అందులో
వెల్లడించింది.