మా బంగారం మాకు ఇవ్వండి..
వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన చేపట్టారు. మా బంగారం మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. గత ఏడాది నవంబర్ 19న రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లో భారీ దోపిడీ జరిగింది. 19 కిలోల బంగారాన్ని అంతరాష్ట్ర దొంగల ముఠా లూటీ చేసింది. ఇప్పటి వరకు 2 కిలోల 520 గ్రాము బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. మా బంగారం మాకు ఇవ్వండంటూ బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

