దుబాయ్ లో ఎవరి సత్తా ఎంత?
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ 1 మంగళవారం దుబాయ్ లో జరగనుంది. ఇండియా ,ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.అయితే గత 25 ఏళ్లలో దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు వన్టేలో ఇంత వరకు తలపడకపోవడం గమనార్హం.ఇతర జట్ల మీద ఆస్ట్రేలియా 4 సార్లు దుబాయ్ వేదికగా గెలవగా…ఇండియా 6 సార్లు గెలిచింది.అయితే ఇరు టీంలు వన్డేల్లో ఇప్పటి వరకు దుబాయ్‌లో బలప్రదర్శనకు దిగలేదు.దీంతో ఇరు జట్ల గెలుపోటముల మీద భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఆస్ట్రేలియా దుబాయ్‌లో ఐదు వన్డేలు ఆడితే ఇందులో 4 గెలిచింది.ఇండియా ఇదే స్టేడియంలో 7 వన్డేలు ఆడితే 6 మ్యాచ్‌లు గెలవగా ఏడో వన్డే డ్రాగా ముగిసింది.దీంతో ఇరు జట్లు విజయావకాశాలు సమంగా ఉండటంతో మ్యాచ్ పట్ల ఉత్కంఠ నెలకొంది.

