మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా
ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తుని మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసే అవకాశముంది. తన ఇంటిపై దాడి చేసి తిరిగి తనపైనే కేసులు నమోదు చేయడమే కాకుండా తనను ఆ కేసులో ఏ1 నిందితురాలిగా చేర్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్‌గా మాత్రమే రాజీనామా చేశానని.. కౌన్సిలర్‌గా కొనసాగుతానని సుధారాణి ప్రకటించారు. ప్రజల కోసం, నా పార్టీ కోసం పోరాడుతానని ఆమె పేర్కొన్నారు.

