ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్
దేశ రాజధాని ఢిల్లీ – ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమె గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. కాసేపటికే ఆమె కోలుకుంది. వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన మహిళా కానిస్టేబుల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.