తునిలో ఉద్రిక్తత..
కాకినాడ జిల్లాలోని తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. మాటా, మాటా పెరిగి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందే ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో తునిలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తుని పట్టణ ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పి, ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా దొడ్డిదారిలో వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు అరాచకం చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. గత కొద్ది రోజుల నుండి వైసీపీ కౌన్సిలర్లను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. కౌన్సిలర్లకు ఫోన్లు చేసి, రేప్ కేసులు పెడతామని వార్నింగ్ లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.