ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ
ఏడీఈ సతీశ్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75 వేలు డిమాండ్ చేశాడు ఏడీఈ. వినియోగదారు నుంచి ఇప్పటికే 25 వేల రూపాయలను ఏడీఈ సతీశ్‌తీసుకున్నాడు. ఈ రోజు రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.