Home Page SliderTelangana

యువతిపై పెట్రోల్ పోసిన యువకుడికి రిమాండ్

ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి నడిరోడ్డుపైనే యువకుడు బెదిరించాడు. ముందుగా తాను పెట్రోల్ పోసుకుని.. తర్వాత యువతిపై పెట్రోల్ పోశాడు. ఈ తతంగాన్ని స్థానికులు గమనించి యువకుడికి దేహశుద్ధి చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పోసిన యువకుడు ప్రమోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు SI ముత్తయ్య తెలిపారు. యువతి తన బంధువులు సహాయంతో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి పెట్రోల్ డబ్బా, ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.