త్వరలో కొత్త రూ.50నోట్లు
కొత్త 50 రూపాయల నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఆర్బిఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకంతో ఉన్న కొత్త నోట్ల రిలీజ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.ఈ విషయాన్ని ఆర్బిఐ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం చలామణిలోఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ సంతకంతో కూడుకుని ఉన్నాయి. ఆయన స్థానంలో గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త నోట్లను ముద్రించాలని ఆర్బిఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది