మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కు సీఎం నివాళి
భారత మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశంలో విద్యా రంగం అభివృద్ధికి గొప్ప కృషి చేసిన విద్యావేత్తగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నో సేవలు అందించారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి , చామల కిరణ్ లు నివాళులర్పించారు.