జయలలిత రూ.4వేల కోట్ల ఆస్తిపై హక్కు ఎవరికంటే…
దివంగత తమిళనాడు ముఖ్యమంత్ర జయలలితకు సంబంధించిన రూ.4వేల కోట్ల విలువ చేసే ఆస్తిపై పూర్తి హక్కులు తమిళనాడు ప్రభుత్వానివే అంటూ తేల్చింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. వాటిని ఫిబ్రవరి 14,15 తేదీలలో ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఆమెకు చెందిన 1500 ఎకరాలకు పైగా భూములు, 30 కిలోల బంగారం, వజ్రాభరణాలు, చీరలు, చెప్పులు, గడియారాలు వంటి విలువైన అన్ని వస్తువులకూ వారసులమంటూ దీపక్, దీప అనే వ్యక్తులు వేసుకున్న పిటిషన్‌ను ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సుమారు దశాబ్దం క్రితం వీటిని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో వాటి విలువ రూ.913 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ.4 వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.